టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్‌ను కొనసాగించాలా లేదా టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పించి కేవలం వన్డే, టీ20లకే కోచ్‌గా ఉంచాలా అనేది ఆస్ట్రేలియాలో జరగబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తేలనుంది. ఆసీస్ గడ్డపై నవంబర్ 22 నుంచి డిసెంబర్ 30 వరకు ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్‌లో టీమిండియా ఒకవేళ పేలవ ప్రదర్శన చేస్తే కచ్చితంగా కోచ్ గంభీర్‌పైనే తొలి వేటు పడనుందని తెలుస్తోంది.
రీసెంట్‌గా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0-3తో వైట్‌వాష్‌కు గురై అపకీర్తి మూటగట్టుకున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా బీసీసీఐ ఆరు గంటలపాటు కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్‌తో చర్చించింది. కివీస్‌తో జరిగిన సిరీస్‌లో తీసుకున్న నిర్ణయాలపై ఆరాతీసింది. ఆఖరి టెస్ట్‌లో బుమ్రాకు రెస్ట్ ఇవ్వడంపైనా, గంభీర్ అప్రోచ్‌పైనా ప్రశ్నలు అడిగింది. బీసీసీఐ గంభీర్ విషయంలో కాస్త విముఖంగా ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం టీమిండియా టీ20 జట్టుకు ఇంటర్మ్ హెడ్ కోచ్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్‌కు టెస్ట్ జట్టు బాధ్యతలూ అప్పగించే ఆలోచన ఉన్నట్టు బీసీసీఐ వర్గాల ద్వారా తెలిసింది. ఒకవేళ అదే జరిగితే గంభీర్‌కు వన్డే, టీ20 బాధ్యతలు ఇస్తారు. దీనికి గంభీర్ అంగీకరించకపోతే వీవీఎస్ లక్ష్మణ్‌నే మూడు ఫార్మాట్లకూ కొనసాగించే అవకాశాలూ లేకపోలేదు. ఏదైమైనా గంభీర్‌కు తాడో పేడోలా మరింది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.
‘ఆస్ట్రేలియా’లోనే గంభీర్ ప్యూచర్
Categories: