Cricket Josh IPL ముంబైకి మాంచి వికెట్ కీప‌ర్?

ముంబైకి మాంచి వికెట్ కీప‌ర్?

ముంబైకి మాంచి వికెట్ కీప‌ర్? post thumbnail image

ఐపీఎల్ మెగా ఆక్ష‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ మిగ‌తా స్లాట్స్‌ను ఎలా భ‌ర్తీ చేసుకున్నా, ఎవ‌రితో భ‌ర్తీ చేసుకున్నా స‌రే, వికెట్ కీప‌ర్ విష‌యంలో మాత్రం నిఖార్సైన బ్యాట‌ర్ క‌మ్ కీప‌ర్ కోసం చూస్తోంది. గ‌తంలో ఈ టీమ్‌కు ఆడిన ఇషాన్ కిష‌న్‌ను రిలీజ్ చేయ‌డంతో..ఆ స్లాట్ కోసం ఎవ‌రిని తీసుకుంటుందా? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఒక‌వేళ మ‌ళ్లీ ఇషాన్ కిష‌న్‌నే తీసుకుంటుంది అనే వాళ్లూ ఉన్నారు. ఐతే ఈ స్లాట్ కోసం ఎవ‌రెవ‌ర్ని ముంబై ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటుందో చూద్దాం..
ఇండియ‌న్ వికెట్ కీప‌ర్ల విష‌యానికొస్తే…ఇషాన్ కిష‌న్‌, రిష‌బ్ పంత్, కేఎల్ రాహుల్, జితేశ్‌శ‌ర్మ పేర్లే ముందుగా వ‌స్తాయి. వీళ్ల‌లో రిష‌బ్ పంత్ కోసం వెళ్లే అవ‌కాశాలున్నాయి. ఒక‌వేళ అత‌ను ద‌క్క‌క‌పోతే ఇషాన్‌ను ఆర్టీఎమ్ ద్వారా తీసుకోవ‌చ్చు. ఇషాన్ వ‌ద్ద‌నుకుంటే జితేశ్‌శ‌ర్మ వైపూ వెళ్లే అవ‌కాశాలు లేక‌పోలేదు.
ఫారిన్ వికెట్ కీపర్ల కోసం వెళితే…ముందుగా జాస్ బ‌ట్ల‌ర్‌పైనే క‌న్నేస్తుంది ముంబై ఇండియ‌న్స్. రోహిత్‌తో క‌లిసి ఓపెనింగ్ చేయించొచ్చు. ఐతే బ‌ట్ల‌ర్ కోసం పోటీ తీవ్రంగా ఉంటుంది. ఇంగ్లండ్‌కే చెందిన మ‌రో ఇద్ద‌రు వికెట్ కీప‌ర్లు ఫిల్ సాల్ట్, జానీ బెయిర్‌స్టో కూడా ముంబై టీమ్‌కు అతికిన‌ట్టు సరిపోతారు. ఈ ఇద్ద‌రూ ఓపెనింగ్ చేయ‌గ‌ల‌రు. వీళ్ల‌లో ఒక‌ర్ని తీసుకునే చాన్స్ ఉంది. ఒక‌వేళ లెప్ట్ అండ్ రైట్ కాంబినేష‌న్ కోసం చూస్తే..డెవాన్ కాన్వే కూడా ఉన్నాడు. ఈ న్యూజిలాండ్ వికెట్ కీప‌ర్ సీఎస్కే త‌ర‌పున అద‌ర‌గొట్టిన సంగ‌తి తెలిసిందే.
ముంబై రిటైన్ చేసుకున్న వాళ్లంతా ఇండియ‌న్ ప్లేయ‌ర్స్ కావ‌డంతో..ఆక్ష‌న్‌లో ఫారిన్ ప్లేయ‌ర్స్ స్లాట్స్ ఖాళీగానే ఉన్నాయి. వికెట్ కీప‌ర్ స్లాట్‌ను ఫారిన‌ర్‌తో భ‌ర్తీ చేసే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

వార్న‌ర్ రికార్డ్ బ్రేక్ చేసిన కింగ్వార్న‌ర్ రికార్డ్ బ్రేక్ చేసిన కింగ్

ఐపీఎల్‌లో అత్య‌ధిక 50+ స్కోర్లు సాధించిన క్రికెట‌ర్‌గా విరాట్ కోహ్లీ రికార్డ్ క్రియేట్ చేశాడు. పంజాబ్ కింగ్స్ పై హాఫ్ సెంచ‌రీ చేయ‌డంతో కోహ్లీ 50+ స్కోర్ల సంఖ్య 67కు చేరింది. అంత‌కు ముందు ఈ రికార్డు డేవిడ్ వార్న‌ర్ పేరిట

రివేంజ్‌తో క‌మ్ బ్యాక్ అవుతారా?రివేంజ్‌తో క‌మ్ బ్యాక్ అవుతారా?

గ‌త సీజ‌న్‌లో అద్భుతంగా ఆడిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌..ఫైన‌ల్ మ్యాచ్‌లో కోల్‌క‌త నైట్‌రైడ‌ర్స్ చేతిలో ఓట‌మిపాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి బ‌దులు తీర్చుకునే టైమ్ వ‌చ్చింది. ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్‌తో త‌ల‌ప‌డ‌బోతోంది స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్. ఈ సీజ‌న్ ఆరంభ మ్యాచ్‌లో రాజ‌స్థాన్

మాజీ ఛాంపియ‌న్లకు క‌ష్ట‌మేనా?మాజీ ఛాంపియ‌న్లకు క‌ష్ట‌మేనా?

ఐపీఎల్ సీజ‌న్ 18లో ఇంకా చాలా మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇప్పుడే టీమ్స్‌పై ఒక అంచ‌నాకు రావ‌డం స‌రైన‌ది కాక‌పోయినప్ప‌టికీ…ఆ టీమ్స్ ఆట‌తీరు గురించి చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ముఖ్యంగా మాజీ చాంపియ‌న్లు ముంబై ఇండియ‌న్స్, చెన్నై సూప‌ర్ కింగ్స్, కోల్‌క‌త నైట్‌రైడ‌ర్స్,