2007 టీ20 వరల్డ్‌కప్‌లో యువరాజ్‌సింగ్ 6 బాల్స్‌లో 6 సిక్సర్లు కొట్టిన సీన్..ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ అద్భుతం జరిగింది సౌతాఫ్రికాలోని డర్బన్‌లో.. ఆ ఫీట్‌కు 17 ఏళ్లు పూర్తైనా..మరోసారి గుర్తుకొస్తోంది. ఎందుకంటే, ఇప్పుడు ఇండియా, సౌతాఫ్రికా మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగబోయేది డర్బన్‌లోనే. టీమిండియాలో ఉన్న బ్యాటర్లంతా దాదాపు దబిడి దిబిడి బ్యాచే.. అవలీలగా సిక్సర్లు కొట్టగల సమర్థులు. ఆల్రెడీ బంగ్లాదేశ్‌తో హైదరాబాద్‌లో ఆడిన చివరి టీ20 మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లు కొట్టడం చూశాం.
ఇప్పుడున్న టీమ్‌లో సిక్సర్ల మోత మోగించేందుకు రెడీ అయ్యారు కుర్రాళ్లు..ఓపెనర్ అభిషేక్ శర్మ, గత సీజన్ ఐపీఎల్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లిన ఘనతలో అతడిదే ప్రధాన పాత్ర. ఇక కెప్టెన్ సూర్యకుమార్ కుదరుకుంటే సిక్సర్ల సునామీయే చూపిస్తాడు. హార్దిక్ పాండ్య తక్కువేం కాదు, సిక్సర్లు ఇంత ఈజీగా కొట్టొచ్చా అనిపిస్తుంది అతడు సిక్సర్లు కొట్టడం చూస్తే…ఇక టీమ్‌లో మరో 5 సిక్సర్ల వీరుడు ఉన్నాడు అతడే రింకూ సింగ్. ఐపీఎల్‌లో ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లు బాది ఫేమస్ అయ్యాడు. టీమిండియాలోనూ చోటు సంపాదించడానికి ఆ ఇన్నింగ్సే కారణం.
మరి ఇంతమంది సిక్సర్ల వీరులు…యువీ 6 సిక్సర్ల నేలపై సౌతాఫ్రికాతో ఆడబోతున్నారు. ఈ మ్యాచ్‌లో ఎవరెన్ని సిక్సర్లు కొడతారే అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది.