Cricket Josh IPL స‌న్‌రైజ‌ర్స్‌కు ఆ ముచ్చ‌ట తీరేనా?

స‌న్‌రైజ‌ర్స్‌కు ఆ ముచ్చ‌ట తీరేనా?

స‌న్‌రైజ‌ర్స్‌కు ఆ ముచ్చ‌ట తీరేనా? post thumbnail image

చెన్నైకి ఎమ్ఎస్ ధోనిలాగా, ఆర్సీబీకి విరాట్ కోహ్లీలాగా, ముంబైకి రోహిత్‌శ‌ర్మ‌లాగా, రాజ‌స్థాన్‌కు సంజూ శాంస‌న్ లాగా, ఇలా ఇండియాకు ఆడిన‌, ఆడుతున్న సూప‌ర్‌స్టార్ ప్లేయ‌ర్స్ ఎవ‌రైనా ఒక‌రు స‌న్‌రైజ‌ర్స్‌కూ ఉంటే బాగుండ‌ని అభిమానులు కోరుకుంటూనే ఉన్నారు. కానీ స‌న్‌రైజ‌ర్స్ ఎక్కువ‌గా ఫారిన్ ప్లేయ‌ర్స్‌పైనే డిపెండ్ అవుతూ ఉంటుంది. ఒక‌వేళ ఈసారి మెగా ఆక్ష‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ ఇండియా స్టార్స్‌ను తీసుకోవాల‌నుకుంటే ఏ ఆట‌గాళ్లను తీసుకోవ‌చ్చు? అనే చ‌ర్చా జ‌రుగుతోంది.

ప్ర‌స్తుతం మెగా ఆక్ష‌న్‌లో ఉన్న ఇండియ‌న్ ప్లేయ‌ర్స్‌లో బ్యాట‌ర్ల విష‌యానికొస్తే.. కేఎల్ రాహుల్, రిష‌బ్ పంత్, శ్రేయ‌స్ అయ్య‌ర్, వెంకటేశ్ అయ్య‌ర్, ఇషాన్ కిష‌న్ కోసం ఫ్రాంచైజీలు పోటీప‌డే చాన్స్ ఉంది. మ‌రి వీళ్ల‌లో స‌న్‌రైజ‌ర్స్ ఎవ‌రి కోసమైనా వెళ్తుందా అనేది చూడాలి.

ఇక గ‌త సీజన్‌లో చూస్తే నిఖార్సైన స్పిన్న‌ర్ క‌రువ‌య్యాడు. ప్ర‌స్తుతం ఫామ్‌లో ఉన్న వాషింగ్ట‌న్ సుంద‌ర్‌ను మ‌ళ్లీ తీసుకునే చాన్స్ లేక‌పోలేదు. ఇక‌ ఇండియా స్పిన్న‌ర్లు అశ్విన్, యుజ్వేంద్ర చ‌హాల్ ఉన్నారు. ఒక‌వేళ దేశీ స్పిన్న‌ర్ల కోసం వెళితే సుయాస్ శ‌ర్మ‌, స్వ‌ప్నిల్ సింగ్ కూడా ఉన్నారు. పేస్ బౌల‌ర్ల‌లో రిలీజ్ చేసిన కె. న‌ట‌రాజ‌న్‌ను మ‌ళ్లీ తీసుకునే చాన్స్ ఉంది. ఇత‌నితో పాటు భువీ, అర్ష్‌దీప్ సింగ్, మ‌హ్మ‌ద్ సిరాజ్, మ‌హ్మ‌ద్ ష‌మి, దీప‌క్ చ‌హార్, హ‌ర్ష‌ల్ ప‌టేల్, ఆకాశ్‌దీప్ ఉన్నారు. మ‌రి వీళ్ల‌లో ఏ ఇండియ‌న్ ప్లేయ‌ర్స్‌ని స‌న్‌రైజ‌ర్స్ తీసుకుంటుంద‌నేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

ఇటు కింగ్‌..అటు కేఎల్ క‌మింగ్..ఇటు కింగ్‌..అటు కేఎల్ క‌మింగ్..

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ వ‌దులుకునేందుకు సిద్ధ‌ప‌డిన కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌మ జ‌ట్టులోకి తీసుకునేందుకు రెడీగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే అందుకు సంబంధించిన టాక్స్ కూడా జ‌రిగాయ‌ట‌. కేఎల్ రాహుల్ న‌మ్మ క‌న్న‌డిగ అంటూ ఇప్ప‌టికే సోష‌ల్

ల‌క్నోకి బ్యాడ్ న్యూస్ల‌క్నోకి బ్యాడ్ న్యూస్

గుజ‌రాత్ టైట‌న్స్‌తో జ‌ర‌గుతున్న మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఐతే హోమ్ గ్రౌండ్‌లో ఆడుతున్న‌ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఈ మ్యాచ్‌లో ఒక మార్పుతో బ‌రిలోకి దిగుతోంది. సూప‌ర్ ఫామ్‌లో ఉన్న ఓపెన‌ర్ మిచెల్ మార్ష్

లో స్కోర్ థ్రిల్ల‌ర్‌లో బ‌ల్లేబ‌ల్లేలో స్కోర్ థ్రిల్ల‌ర్‌లో బ‌ల్లేబ‌ల్లే

రెండొంద‌లు..రెండొంద‌ల‌కు పైగా ర‌న్స్‌ను ఛేజ్ చేసిన సంద‌ర్భాలు చూశాం..య‌మా థ్రిల్లింగ్ అనిపించాయి. మొన్న స‌న్‌రైజ‌ర్స్ పై 245 ర‌న్స్‌ కాపాడుకోలేక‌పోయిన పంజాబ్..ఇప్పుడు కేకేఆర్‌పై 112 ప‌రుగుల స్కోర్‌ను కాపాడుకుని ఇది అంత‌కుమించిన థ్రిల్ ఇచ్చింది. రికార్డ్ క్రియేట్ చేసింది.  112 ర‌న్స్