టీమిండియా స్వదేశంలో 0-3తో న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్‌కు గురై, వారం గడించిందో లేదో, అప్పుడే మరో సిరీస్‌కు సిద్ధమైంది. ఆ టీమ్‌లోని ఒక్క అక్షర్ పటేల్ తప్ప మిగతా వారంతా టెస్ట్ జట్టులో లేనివారే. పక్కా టీ20 బ్యాటర్లు. ఇక మనం చాంపియన్లుగా చలామణి అవుతున్న ఫార్మాట్‌లో..సౌతాఫ్రికాతో నాలుగు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడబోతోంది. నవంబర్ 8న డర్బన్‌లో తొలి మ్యాచ్ జరుగుతుంది. వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.
ఇప్పటికే సూర్య టీ20ల్లో కెప్టెన్‌గా ఇండియాను దిగ్విజయంగా నడిపిస్తున్నాడు. ఫామ్‌లో ఉన్న యువ బ్యాటర్ అభిషేక్‌శర్మ, సీనియర్ ప్లేయర్ సంజూ శాంసన్, సూర్య, తిలక్‌వర్మ, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్…సఫారీ పేసర్లపై ఎంతమేరకు ఎదురుదాడి చేస్తారనే దానిపై సిరీస్ ఫలితం ఆధారపడి ఉంటుంది. జెరాల్డ్ కొట్జియా, ఓట్నిల్ బార్ట్‌మన్, మార్కో యాన్సెన్‌తో సౌతాఫ్రికా పేస్ ఎటాక్ బలంగా ఉంది. ఇక బ్యాటింగ్‌లోనూ కెప్టెన్ మార్క్‌రమ్, క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్ ఇండియా బౌలింగ్‌ను ఐపీఎల్‌లో ఎన్నోసార్లు ఫేస్ చేశారు. మరి అర్ష్‌దీప్‌సింగ్, అవేశ్‌ఖాన్, యష్ దయాళ్ తో ఇండియా పేస్ ఎటాక్ కూడా ధీటుగా బదులిచ్చేందుకు రెడీ అయింది.
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి ఇండియా ట్రోఫీ గెలిచిన సంగతి తెలిసిందే. ఆ పరాభవానికి బదులు తీర్చుకునేందుకు సౌతాఫ్రికా కాచుకుని ఉంది. మరి ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. దీంతో టీమిండియా యువ సైన్యానికి, సౌతాఫ్రికా సీనియర్ల బలగానికి మధ్య పోరు ఉత్కంఠరేపుతోంది.
చేదు మరిపించి..తీపితో మురిపిస్తారా
Categories: