Cricket Josh IPL న‌లుగురి ఆడిష‌న్ సౌతాఫ్రికాలో..

న‌లుగురి ఆడిష‌న్ సౌతాఫ్రికాలో..

న‌లుగురి ఆడిష‌న్ సౌతాఫ్రికాలో.. post thumbnail image

సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న టీమిండియా ఆట‌గాళ్ల‌లో న‌లుగురు త‌ప్ప మిగ‌తా వాళ్లంతా ఏదో ఒక ఫ్రాంచైజీ రిటైన్ చేసుకున్న వాళ్లే…ఐతే ఆ న‌లుగురు ఇప్పుడు సౌతాఫ్రికాతో జ‌ర‌గ‌బోయే టీ20 సిరీస్‌లో స‌త్తాచాటితే ఇటు ఇండియాకు మేలు, అటు వాళ్ల‌కు ఆక్ష‌న్‌లో మంచి ధ‌ర ద‌క్కే చాన్స్ కూడా ఉంటుంది.

పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసిన‌ అర్ష్‌దీప్‌సింగ్ ఇప్పుడు ఆక్ష‌న్‌లో హాట్‌కేక్‌లా మార‌నున్నాడు. ప్ర‌స్తుతం సౌతాఫ్రికాతో జ‌ర‌గ‌బోయే టీ20 సిరీస్‌లో ఇత‌డే టీమిండియాకు ప్రంట్‌లైన్ బౌల‌ర్‌. ఆక్ష‌న్‌లో ఇత‌ని కూడా తీవ్ర‌మైన పోటీ ఉంటుంది. మిగ‌తా ఫ్రాంచైజీలు పోటీప‌డి ద‌క్కించుకున్నా స‌రే, ఒక‌వేళ పంజాబ్ కింగ్స్ తీసుకోవాల‌నుకుంటే ఆర్టీఎమ్ కార్డ్ ద్వారా తిరిగి పొందొచ్చు.
ఇక రెండో ప్లేయ‌ర్ జితేశ్ శ‌ర్మ‌..ఇత‌డిని కూడా పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసింది. ప్ర‌స్తుతం సౌతాఫ్రికా టూర్‌లో ఉన్న జితేశ్‌కు ప్లేయింగ్ ఎలెవ‌న్‌లో చాన్స్ వ‌స్తే మ‌రోసారి ప్రూవ్ చేసుకుందామ‌ని చూస్తున్నాడు. ఐతే వికెట్ కీప‌ర్ సంజూ శాంస‌న్ ఉండ‌టంతో ఇత‌నికి ఎన్ని అవ‌కాశాలు ఇస్తార‌నేది చూడాలి.
మూడో ప్లేయ‌ర్ వైశాక్ విజ‌య్‌కుమార్, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ర‌పున ఆడిన ఈ యువ బౌల‌ర్ వికెట్ల వేట‌లో ఆక‌ట్టుకున్నాడు. ఐతే ఇప్పుడు స‌ఫారీ గ‌డ్డ‌పై స‌త్తాచాటి ఆక్ష‌న్‌లో మెరిసేందుకు రెడీ అయ్యాడు.
నాలుగో ప్లేయ‌ర్ అవేశ్‌ఖాన్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఇత‌డిని రిలీజ్ చేసింది. టీమిండియాలో ఇన్ అండ్ ఔట్ అవుతున్న ఈ పేస‌ర్‌, సౌతాఫ్రికాపై టీ20ల్లో రెచ్చిపోతే ఐపీఎల్ ఆక్ష‌న్‌లో మంచి ధ‌ర ద‌క్క‌డం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

స‌న్‌రైజ‌ర్స్‌కు ఆ ముచ్చ‌ట తీరేనా?స‌న్‌రైజ‌ర్స్‌కు ఆ ముచ్చ‌ట తీరేనా?

చెన్నైకి ఎమ్ఎస్ ధోనిలాగా, ఆర్సీబీకి విరాట్ కోహ్లీలాగా, ముంబైకి రోహిత్‌శ‌ర్మ‌లాగా, రాజ‌స్థాన్‌కు సంజూ శాంస‌న్ లాగా, ఇలా ఇండియాకు ఆడిన‌, ఆడుతున్న సూప‌ర్‌స్టార్ ప్లేయ‌ర్స్ ఎవ‌రైనా ఒక‌రు స‌న్‌రైజ‌ర్స్‌కూ ఉంటే బాగుండ‌ని అభిమానులు కోరుకుంటూనే ఉన్నారు. కానీ స‌న్‌రైజ‌ర్స్ ఎక్కువ‌గా ఫారిన్

ఫామ్‌లో లేని ర‌షీద్‌ను ఫామ్‌లోకి తెస్తారా?ఫామ్‌లో లేని ర‌షీద్‌ను ఫామ్‌లోకి తెస్తారా?

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మాజీ ప్లేయ‌ర్…ర‌షీద్ ఖాన్‌ గుజ‌రాత్ టైట‌న్స్ బౌలింగ్ లైన‌ప్‌లో కీల‌క స్పిన్న‌ర్‌. ఐతే ఇత‌డు త‌న స్థాయికి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు గుజ‌రాత్ మూడు మ్యాచులు ఆడ‌గా..ర‌షీద్ ఒకే ఒక్క వికెట్ తీశాడు. అది

ఓ రేంజ్‌లో కొట్టాడు…ఆరెంజ్ క్యాప్‌ పెట్టాడుఓ రేంజ్‌లో కొట్టాడు…ఆరెంజ్ క్యాప్‌ పెట్టాడు

మొన్న‌టి మొన్న నికోల‌స్ పూర‌న్‌..స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌పై ఊచ‌కోత‌, విధ్వంసం, ప్ర‌ళ‌యం అన్నీ క‌ల‌గ‌లిపి సృష్టించిన విష‌యం గుర్తుంది క‌దా..తాజాగా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై ఒక డీసెంట్ నాక్ ఆడాడు. ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ పెట్టుకున్నాడు. అర్థ‌మైంది క‌దా..ఈ లీగ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు లీడింగ్