నవంబర్ 24, 25న సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగబోయే ఐపీఎల్ మెగా ఆక్షన్ కోసం అంతా సిద్ధమైంది. ఆటగాళ్లు కూడా తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. మొత్తం 1574 మంది ఆటగాళ్లు ఆక్షన్ లిస్ట్‌లో తమ పేరును నమోదు చేసుకోగా, ఇందులో ఇటలీకి చెందిన థామస్ డ్రాకా కూడా ఉన్నాడు. ఇటలీ నుంచి ఒక ప్లేయర్ రిజిస్టర్ అవడం ఐపీఎల్ చరిత్రలోనే ఇదే మొదటిసారి. 24 ఏళ్ల థామస్ డ్రాకా ఈ ఏడాదే టీ20లో అరంగేట్రం చేశాడు. అది కూడా, టీ20 ప్రపంచకప్ సబ్ రీజనల్ యూరోపియన్ క్వాలిఫయర్స్ లో లక్సెంబర్గ్‌పై ఆడాడు. ఇతను రైట్ ఆర్మ్ మీడియం పేసర్. మరి థామస్ తొలిసారి ఆక్షన్‌లో ఏ ఫ్రాంచైజీనైనా ఆకట్టుకుంటాడో చూడాలి.
మొత్తం 1574 మంది ప్లేయర్స్ రిజిస్టర్ చేసుకోగా, ఇందులో ఇండియా నుంచి 1165 మంది, 409 మంది ఫారిన్ దేశాల నుంచి ఉన్నారు. ఇండియా తర్వాత ఎక్కువ మంది సౌతాఫ్రికా నుంచి 91 ఉండగా, ఆస్ట్రేలియా – 76, ఇంగ్లండ్- 52, న్యూజిలాండ్ -39, వెస్టిండీస్-33, శ్రీలంక- 29, ఆఫ్గనిస్తాన్ నుంచి 29 మంది తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు.
ఇటలీ నుంచి తొలిసారిగా..
Categories: