గ్లెన్ ఫిలిప్స్..న్యూజిలాండ్ ఆల్‌రౌండర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ రిలీజ్ చేసిన ఆటగాడు. ఇతడు అలాంటి ఇలాంటి ఆల్‌రౌండర్ కాదు..లోయర్ ఆర్డర్‌లో వచ్చి సిక్సర్లు బాదగలడు, స్పిన్ బౌలింగ్ వేసి వికెట్లు తీయగలడు, మెరుపు ఫీల్డింగ్‌తో అద్భుతమైన క్యాచ్‌లు పట్టగలడు, వికెట్ కీపింగ్ కూడా చేయగలడు. వాట్ నాట్..ప్రతీది చేయగలడు. మరి ఇలాంటి ఆటగాడిని ఏ ఫ్రాంచైజీ వదులుకుంటుంది చెప్పండి.. వదులుకుందిగా సన్‌రైజర్స్ అంటారా?
నిజమే, గత సీజన్‌లో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. బెంచ్‌కే పరిమితం చేసింది. అంతకు ముందు సీజన్‌లో(2023) కేవలం 5 మ్యాచుల్లోనే ఆడించింది. అందులో ఒక మ్యాచ్ గెలిపించాడు కూడా..2021లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉండి, కేవలం 3 మ్యాచ్‌లే ఆడాడు. ఇతడి బేస్ ప్రైస్ రూ.50 లక్షలు ఉన్నపుడు సన్‌రైజర్స్ కోటిన్నరకు దక్కించుకున్నది. రెండు సీజన్‌లూ అదే ధర. ఇక ఈసారి ఆక్షన్‌లోకి వెళ్లడంతో తన బేస్ ప్రైస్‌ను రూ.2 కోట్లకు పెంచుకున్నాడు గ్లెన్ ఫిలిప్స్. అంటే ఈసారి డిమాండ్ కూడా ఆ రేంజ్‌లోనే ఉంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను వదులుకుంది, ఒకవేళ ఆ జట్టు గ్లెన్ ఫిలిప్స్‌ను ఆక్షన్‌లో ట్రై చేసే చాన్స్ ఉంది. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ కూడా పోటీపడే అవకాశాలున్నాయి. అంతెందుకు ఒకవేళ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐనా ఆర్టీఎమ్ కార్డ్ ద్వారా తిరిగి దక్కించుకోవచ్చు. ఏదేమైనా గ్లెన్ ఫిలిప్స్‌కు జాక్‌పాట్ తగిలే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
జాక్‌పాట్ ఖాయమే?
Categories: