ఒకరేమో ఇండియా పాకిస్తాన్‌కు వెళ్లి ఆడితే పాకిస్తాన్ కచ్చితంగా ఇండియాను ఓడిస్తుందంటాడు..ఇంకొకరేమో పాకిస్తాన్ తమ స్పిన్ ట్రాక్‌పై ఇండియాను ఈజీగా బోల్తా కొట్టిస్తుంది అని అంటారు. ఎక్కడ దొరికార్రా మీరంతా.. ఈ సీన్ ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ మొదటి వన్డే మ్యాచ్ సందర్భంగా జరిగింది. కామెంట్రా బాక్స్‌లో ఉన్న ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకెల్ వాన్, పాక్ మాజీ పేసర్ వసీమ్ అక్రమ్‌తో ఇండియా రీసెంట్ ఓటమి గురించి ప్రస్తావించాడు.
“భారత్-పాకిస్థాన్ మధ్య టెస్టు సిరీస్ చూడాలనుకుంటున్నాను. ఇది క్రికెట్‌లో చాలా పెద్ద సిరీస్ అవుతుంది. ఇది ఆటకే కాదు, ఎంతో క్రేజ్ ఉన్న రెండు క్రికెట్ దేశాలకు మేలు చేస్తుంది. అంటూ మొత్తంగా ఇండియా, పాకిస్తాన్ ఆడితే చూడాలని ఉందంటూ చెప్పాడు. అక్కడితో ఆగలేదు..పాకిస్తాన్ తమ స్పిన్ పిచ్‌లపై ఇండియాను ఓడించగలదు కదా..అంటూ అక్రమ్ ను అడిగాడు. అక్రమ్ ఆగుతాడా…ఇప్పుడు పాకిస్తాన్ టీమ్ ఇండియాను ఓడించగలదని, ఆల్రెడీ ఇంగ్లండ్‌పై సత్తాచాటిందంటూ తమ టీమ్ గురించి గొప్పలు చెప్పాడు. సరే, అలాగే అనుకుందాం..గత వరల్డ్‌కప్‌లో ఏం జరిగింది, అంతకు ముందు వరల్డ్‌కప్‌లో ఏం జరిగింది? అన్న విషయం వసీమ్ అక్రమ్‌కు గుర్తులేదా? సక్లైయిన్ ముస్తాక్, ముస్తాక్ అహ్మద్ లాంటి స్పిన్నర్లను ఇండియా లెజెండ్స్ సచిన్, ద్రవిడ్, గంగూలీ ఎలా ఆడుకున్నారో గుర్తు లేదా? పోనీ ఇప్పటి క్రికెటర్ల గురించి మాట్లాడినా… రోహిత్, కోహ్లీ పాక్ స్పిన్నర్లను వరల్డ్‌కప్‌లో ఎలా ఆడారో చూడలేదా?
ఏదో న్యూజిలాండ్‌పై ఒక్క సిరీస్ ఓడిపోగానే, ఇక అంతా అయిపోయిందన్నట్టు మాట్లాడుతున్నారు ఈ మాజీ క్రికెటర్లు..టీమిండియా కచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతుందన్న నమ్మకం ఇక్కడ ప్రతీ అభిమానిలో ఉంది.అన్నట్టు ఆస్ట్రేలియా, పాకిస్తాన్ వన్డే మ్యాచ్ రిజల్ట్ ఏమైందనేది చెప్పలే కదా..మీకు తెలిసే ఉంటుందిలే, ఎస్ మీరు గెస్ చేసింది నిజమే, పాకిస్తాన్ ఓడిపోయింది.