ఐపీఎల్ మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరగనున్నదని సమాచారం. బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నవంబర్ 22 నుంచి ఇండియా ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ ఆడనుంది. ఐతే ఆ సమయంలోనే ఆక్షన్ పెట్టాలా వద్దా అనేదానిపై చర్చ కూడా జరిగింది. ఆస్ట్రేలియా టైమింగ్ ప్రకారం మ్యాచ్ మధ్యాహ్నం వరకు ముగుస్తుంది. అంటే టెస్ట్ మ్యాచ్ మూడో రోజు నవంబర్ 24న మధ్యాహ్నం వరకు ముగుస్తుంది. ఒకవేళ టెస్ట్ మ్యాచ్ మూడు రోజుల్లోనే ఫినిష్ అవుతుంది అనే నమ్మకం బీసీసీఐకి ఉందా? లేదంటే ఇండియన్ టైమింగ్స్ ప్రకారం ఆక్షన్ మొదలయ్యే సమయానికి ఆస్ట్రేలియాలో మూడో రోజు ఆట ముగుస్తుంది కనుక ఎటువంటి క్లాష్ ఉండబోదని భావిస్తోందా?
సరే, ఆక్షన్ తేదీలు అటు ఇటు ఐనా…ఆటగాళ్లు ఎటువైపు , ఎవరికి వెళతారనేది అభిమానుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఇండియా సూపర్ స్టార్స్ రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, అర్ష్‌దీప్‌సింగ్ ను ఎవరు ఎంత ధరకు దక్కించుకుంటారనేది హాట్ టాపిక్ అయింది. ఇక ఫారిన్ స్టార్లలో జాస్ బట్లర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, డేవిడ్ మిల్లర్, గ్లెన్ ఫిలిప్స్ పై ఏ ఫ్రాంచైజీలు ఫోకస్ చేశాయనేది ఆసక్తికర విషయమే.
వేలంలో గాలం ఎవరికి?
Categories: