ఐపీఎల్ మెగా ఆక్షన్ నవంబర్ 24, 25 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు బీసీసీఐ తెలిపింది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఈ మెగా ఈవెంట్ జరుగుతుందని, వేదికను కూడా ఖరారు చేసింది. ముందుగా సౌదీ అరేబియాలోని రియాద్‌లో నిర్వహించేందుకు ప్లాన్ చేయగా, ఇప్పుడు జెడ్డాకు మార్చారు. జెడ్డాలోని అబాది అల్ జొహర్ ఎరీనాలో రెండు రోజుల పాటు ఐపీఎల్ మెగా ఆక్షన్ జరుగుతుంది.
ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలు అక్టోబర్ 31న ఆటగాళ్ల రిటైన్ లిస్ట్‌ను బీసీసీఐకి పంపాయి. ఇక మిగిలింది తమకు కావల్సిన ఆటగాళ్లను మెగా వేలంలో దక్కించుకోవడమే. అత్యధిక పర్స్ పంజాబ్ కింగ్స్ వద్ద రూ.110.5 కోట్లు ఉండగా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ. 83 కోట్లు ఉంది. అత్యల్పంగా రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ. 41 కోట్లు ఉన్నాయి. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ వద్ద చెరో 45 కోట్ల రూపాయలు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ రూ. 55 కోట్లు, కోల్‌కత నైట్‌రైడర్స్ రూ. 51 కోట్లతో ఆక్షన్‌కు రెడీ అయ్యాయి.