జస్ట్ ఇమాజిన్, ఒక బ్యాట్స్‌మన్ ఒక షాట్ అద్భుతమైన రీతిలో కొడితే క్రికెట్ ప్రపంచమంతా రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని అలా నడుచుకుంటూ ఎక్కడికో వెళ్తుంటే..
గూస్ బంప్స్ వచ్చేలా ఆడిన ఇన్నింగ్స్‌లు ఎన్నో ఉన్నాయి..కానీ ఆ ఒక్క షాట్ క్రికెట్ ప్రపంచాన్నే షేక్ చేసింది. అదే విరాట్ కోహ్లీ ఆడిన షాట్..పాకిస్తాన్ బౌలర్ హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో బ్యాక్‌ఫుట్‌లో వెళ్లి స్ట్రెయిట్ అండ్ లాంగ్ ఆఫ్ మధ్యలో సిక్సర్ కొట్టిన షాట్..క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోయే షాట్. ఇదే విషయాన్ని ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) కూడా తమ అధికారిక సైట్‌లో పేర్కొంది. ‘షాట్ ఆఫ్ ద సెంచరీ అంటూ స్టేట్ చేసింది. టీ20 వరల్డ్‌కప్ 2022 సందర్భంగా ఈ అద్బుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. మెల్‌బోర్న్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండియా పాకిస్తాన్‌పై ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసిన సంగతి క్రికెట్ అభిమానులు ఎవరూ మరిచిపోరు. మరి ఇవాళ (నవంబర్ 5) కింగ్ కోహ్లీ పుట్టినరోజు, అందుకే మరోసారి ఆ షాట్ ఆఫ్ ద సెంచరీని గుర్తు చేసుకున్నాం.
టీమిండియాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిన తర్వాత విరాటపర్వం నడిచిందనే చెప్పాలి. మూడు ఫార్మాట్లలో కుమ్మేయడమంటే మామూలు విషయం కాదు. ఈ మూడు ఫార్మాట్లలో (టెస్ట్‌లు, వన్డేలు, టీ20లు) ఎక్కువ రన్స్ చేసిన జాబితాలో కోహ్లీ 4వ స్థానంలో ఉన్నాడు. ఇతని కంటే ముందు రికీ పాంటింగ్, కుమార సంగక్కర, సచిన్ టెండూల్కర్ నెంబర్1 స్థానంలో ఉన్నారు.
సచిన్ టెండూల్కర్ 34,357 రన్స్
కుమార సంగక్కర 28,016
రికీ పాంటింగ్ 27,483
విరాట్ కోహ్లీ 27, 134*
అంతేకాదు ఎక్కువ సెంచరీల రికార్డు (100) కూడా సచిన్ పేరిట ఉండగా, 80 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నది విరాట్ కోహ్లీయే.. కోహ్లీ మాత్రం సచిన్ రికార్డ్‌ను అందుకోవడం కష్టమే, ఐతే కోహ్లీ రికార్డును మరొకరు దాటడం కూడా కష్టమే..ఓవరాల్‌గా చూస్తే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తర్వాత..ది బెస్ట్ విరాట్ కోహ్లీయే..హ్యాపి బర్త్‌డే విరాట్ కోహ్లీ..ఆల్ ద బెస్ట్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టెస్టుల్లో ఆ 30వ సెంచరీ ముచ్చట కూడా తీర్చుకుంటావని ఆశిస్తున్నాం..
ఆ ఒక్క షాట్‌తో..రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని
Categories: