సొంతగడ్డపై కివీస్‌తో వైట్‌వాష్ చేయించుకుని అపకీర్తి మూటగట్టుకున్న టీమిండియాపై మాజీ క్రికెటర్లు స్మూత్‌గా చురకలు అంటిస్తున్నారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ టీమిండియా ఓటమిని జీర్ణించుకోలేకపోయాడు. టీమిండియా ఈసిరీస్‌కు సరిగ్గా ప్రిపేర్ కాలేదా? మన బ్యాటర్ల షాట్ సెలక్షన్ సరిగా లేదా? మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం వల్ల ఇలా జరిగిందా? అంటూ మూడు తప్పిదాలను ఎత్తిచూపాడు. వాటి గురించి కొంచెం బ్రీఫ్‌గా మాట్లాడుకుందాం.
మొదటిది సిరీస్‌కు ప్రిపేర్ కాకపోవడం..
న్యూజిలాండ్ సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడి టీమిండియా 2-0తో గెలిచింది. ఈ రెండు మ్యాచుల్లో ఇండియా ఈజీగా గెలిచింది. బుమ్రా, అశ్విన్, జడేజా బౌలింగ్‌లో ఇరగదీస్తే..బ్యాటింగ్‌లో జైస్వాల్, గిల్, పంత్ సత్తాచాటుకున్నారు. సెప్టెంబర్ 19 నుంచి 22 వరకు తొలి టెస్ట్, సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు రెండో టెస్ట్ జరిగాయి. ఆ తర్వాత న్యూజిలాండ్ సిరీస్ అక్టోబర్ 16 నుంచి మొదలైంది. అక్టోబర్ 1 నుంచి 16 వరకు అంటే 15 రోజుల గ్యాప్ దొరికింది. ఆ గ్యాప్‌లో కాస్త రెస్ట్ దొరికింది. ఐతే న్యూజిలాండ్ సిరీస్‌ను ఒకవేళ లైట్ తీసుకుని ప్రాక్టీస్‌ను పెద్దగా పట్టించుకోలేదా? లేక మెంటల్‌గా ప్రిపేర్ కాలేదా అనే అనుమానాలు ఉన్నాయి.
ఇక షాట్ సెలక్షన్ విషయానికొస్తే…కేవలం ఆఖరి ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకోవచ్చు..జైస్వాల్, గిల్ స్పిన్ ఆడలేక బోల్తా కొట్టారు. రోహిత్‌శర్మ కూడా పేస్ బౌలింగ్‌లో పుల్ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. విరాట్ కోహ్లీ కూడా డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేసి సింపుల్‌గా స్లిప్ ఫీల్డర్ చేతికి చిక్కాడు.
మూడోది మ్యాచ్ ప్రాక్టీస్..అంతకు ముందే బంగ్లాదేశ్ సిరీస్ ఆడిన పదకొండు మందీ..న్యూజిలాండ్ సిరీస్‌లోనూ ఆడారు కాబట్టి మ్యాచ్ ప్రాక్టీస్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఇక సర్ఫరాజ్ ఖాన్ రంజీలో డబుల్ సెంచరీ చేసి అదరగొట్టాడు. అక్టోబర్ 1 వరకూ డొమెస్టిక్‌లో ఆడాడు, ఆ తర్వాత టీమ్‌లోచేరాడు. తనకు తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ కూడా దొరికింది. ఐనా కివీస్‌పై విఫలమయ్యాడు.
మాస్టర్ చెప్పిన ఆ మూడు తప్పిదాలు
Categories: