న్యూజిలాండ్ ఇండియాపై ఇండియాలో 0-2తో టెస్ట్ సిరీస్ గెలిచింది. చివరి టెస్ట్ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకుంటుందా? లేక 0-3తో వైట్ వాష్ చేయించుకుని అపకీర్తి మూటగట్టుకుంటుందా? అనేది ఈ ఆదివారం (నవంబర్ 3, 2024)తో తేలిపోతుంది. వరుసగా 18 సిరీస్‌లు గెలిచిన ఇండియా ఇంత దారుణంగా చావుదెబ్బ తినడానికి కారణాలు వెతికితే…అబ్బోబ్బోబ్బో…. కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్టు ఉంటాయి.
పేస్ బౌలర్లు బాగానే వేస్తున్నారా..అంటే బుమ్రా వైపే చూస్తారు తప్ప, నమ్మదగిన పేసర్ మరొకరు లేరు
పోనీ స్పిన్ బౌలర్లు ఇరగదీస్తున్నారా..అంటే అశ్విన్-జడేజా జోడీ వైపు చూస్తారు…రికార్డులు బాగానే ఉంటాయి, వికెట్లు బాగానే తీస్తున్నారు..ఐనా సరే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.
మరి మన యువ బ్యాటర్లు బాగా ఆడుతున్నారా..అంటే యశస్వి జైస్వాల్ దబిడి దిబిడే..రిషబ్ పంత్ దబిడి దిబిడే. పోనీ లెజెండ్స్, గోట్స్ .. హిట్‌మ్యాన్, చేజ్ మాస్టర్..ఇలా ఎన్నో అలంకారాలున్న రోహిత్, కోహ్లీ దంచేస్తున్నారా అంటే..కష్టమే గురూ..ఒక సిరీస్‌లో ఒక హాఫ్ సెంచరీ, రెండు సిరీసులలో కలిపి ఒక సెంచరీ..ఇలా అన్నమాట. మీరే ఇలా ఉంటే కుర్రాళ్లు వాళ్ల ఇష్టానికి వాళ్లు ఆడుకుని వెళుతున్నారు. టెస్ట్ క్రికెట్ అంటే క్రీజులో పాతుకుపోవాలి..ఒక ద్రవిడ్, లక్ష్మణ్, పుజారలాగ. పోనీ ప్రత్యర్థిని భయపెట్టేలా స్కోర్ చేయాలి..ఒక సచిన్, సెహ్వాగ్‌లాగ..ఇలాంటి క్వాలిటీస్ ఉన్న ప్లేయర్స్ ఉన్నారా. కోహ్లీ కెప్టెన్సీ ఉన్నప్పుడు రికార్డుల మీద రికార్డులు కొట్టాడు. ఆ తర్వాత నుంచి డల్ అయ్యాడు. కారణమేదైనా సరే, టీమ్‌కు ఇబ్బందికరంగా మారొద్దు కదా. ఒక్కటి గెలిస్తే కొంత సర్దుకుంటుంది. అందుకే కివీస్‌తో మూడో టెస్ట్ గెలుపు కచ్చితంగా అవసరం. అసలే ఇద్దరు లెజెండ్స్ కెరియర్ చరమాంకంలో ఉన్నారు, ఈ మ్యాచ్ గెలిచి పరువు నిలబెట్టుకోవాలి. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో జరగబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సత్తాచాటి, యువకులను గైడ్ చేయాల్సిన బాధ్యత ఉంది. అంతేకాదు డబ్ల్యూటీసి ఫైనల్‌కు చేర్చి..మేస్ (ఐసీసీ గధ)ను చేతపట్టాలి.
అంతా దబిడి దిబిడే ఐతే ఎట్లా..
Categories: