సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్ అందరూ ఊహించిందే..ఐతే హెన్రిక్ క్లాసెన్ కోసం ఖర్చు చేసిన ధర మాత్రం ఐపీఎల్ చరిత్రలోనే సెకండ్ బెస్ట్..అక్షరాలు 23 కోట్ల రూపాయలు. ఇన్నాళ్లు భారీ మొత్తం అంటూ ఊహాగానాలు చక్కర్లు కొట్టినా, ఇప్పుడు అవే నిజమయ్యాయి. సన్‌రైజర్స్ ఈ విధ్వంసకర ఆటగాడి కోసం ఏకంగా 23 కోట్లు పెట్టాల్సి వచ్చింది. మిగతా వాళ్లకూ గట్టిగానే ముట్టజెప్పింది. ప్యాట్ కమిన్స్‌ను మాత్రం గత సీజన్ వేలంలో (20.50 కోట్లు) తీసుకున్నదాని కంటే కాస్త తక్కువకే రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకుంది. అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి ఇద్దరే ఇండియన్ ప్లేయర్స్. కమిన్స్, క్లాసెన్, హెడ్‌తో కలిపి మిగతా ముగ్గురూ ఫారిన్ ప్లేయర్స్.
మిగతా ఫ్రాంచైజీల కంటే ఎక్కువగా ఖర్చు చేసింది సన్‌రైజర్సే…రిటెన్షన్ కోసం 75 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా..ఇక ఆక్షన్ కోసం మిగిలింది రూ. 45 కోట్లే. ఆక్షన్‌లో ఎటువంటి వ్యూహంతో వస్తుందనేది కూడా ఆసక్తికర విషయమే. మరొక ఫారిన్ ఆల్‌రౌండర్‌తో పాటు ఇండియన్ టాలెంట్‌ను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది.
క్లాసెన్ కాకా..కెవ్వు కేక
Categories: