తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరుగుతున్న అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. ఏడో నెంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన నితీశ్ 6 బాల్స్ ఆడి రన్స్ చేయకుండానే పెవిలియన్‌కు చేరాడు. అంతేకాదు ఇండియా ఏ తరపున ఏ ఒక్కరూ హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. మొత్తంగా ఇండియా ఏ 107 రన్స్‌కు ఆలౌట్ అయింది. అంతకు ముందు టీ20 సిరీస్‌లో నితీశ్‌కుమార్ ఇరగదీయడంతో అతడిపై అందరిలోనూ అంచనాలు మొదలయ్యాయి, తప్పులేదు ఇది ఇండియా కదా అలాగే ఉంటుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నపుడు కూడా మంచి ప్రదర్శనలే ఇచ్చాడు. అప్పట్నుంచి వెలుగులోకి వచ్చాడు నితీశ్. దిగ్గజాల ప్రశంలు అందుకోవడం, టీమిండియాలో చోటు దక్కించుకోవడం, అక్కడ కూడా సత్తాచాటడం..ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి. ఐతే అసలైన ఆట ఇప్పుడు మొదలైంది..కోచ్ గంభీర్ కొందరు యువ ఆటగాళ్లను పట్టుబట్టి మరీ ఆస్ట్రేలియా సిరీస్‌కు కావాలన్నాడు. ఎందుకంటే ఇండియాలో ఆడి మెప్పించడం ఒకెత్తు, విదేశాల్లో ఆడి మెప్పించడం మరొకెత్తు. ఆసీస్ కండీషన్స్‌కు అలవాటుపడాలి, అక్కడి బౌన్స్, పేస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలగాలి, అప్పుడే వారిలోని స్కిల్స్ బయటకొస్తాయి. భవిష్యత్ తరం కోసం గంభీర్ చురుకుగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న వేళ..నితీశ్ కుమార్ టీమిండియా నెక్ట్స్ హోప్‌గా మారే ప్రయత్నం చేస్తే తెలుగు అభిమానులకు కావల్సిందేముంది.
డకౌట్ ఐతే అయ్యావు..రాటుదేలాలి
Categories:
Related Post
అప్పుడు ఆ ముగ్గురు…ఇప్పుడు ఎవరు?అప్పుడు ఆ ముగ్గురు…ఇప్పుడు ఎవరు?
ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జరగబోయే రెండో టెస్ట్ కోసం కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. చెపాక్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా…ఇప్పుడు కాన్పూర్‌లో రెండో టెస్ట్‌కు సిద్ధమైంది. చెపాక్‌లో అశ్విన్, పంత్, గిల్ సెంచరీలు చేసి ఊపు
ఆ ఒక్క షాట్‌తో..రెండు జేబుల్లో చేతులు పెట్టుకునిఆ ఒక్క షాట్‌తో..రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని
జస్ట్ ఇమాజిన్, ఒక బ్యాట్స్‌మన్ ఒక షాట్ అద్భుతమైన రీతిలో కొడితే క్రికెట్ ప్రపంచమంతా రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని అలా నడుచుకుంటూ ఎక్కడికో వెళ్తుంటే.. గూస్ బంప్స్ వచ్చేలా ఆడిన ఇన్నింగ్స్‌లు ఎన్నో ఉన్నాయి..కానీ ఆ ఒక్క షాట్ క్రికెట్
పేరే కాదు, ఆట కూడా..ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీయేపేరే కాదు, ఆట కూడా..ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీయే
బెంగళూరులో ఇండియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర సెంచరీ కొట్టాడు..అందరికీ తెలుసు కదా, రచిన్ రవీంద్ర అనే పేరు ఎవరు, ఎందుకు పెట్టారో కూడా కొద్ది మందికి తెలుసు. ఐనాసరే మరోసారి గుర్తు చేసుకుందాం. ఇతని నాన్న,