రాజస్థాన్ రాయల్స్ ఓపెనింగ్ బ్యాటర్ జాస్ బట్లర్..ఆ ఫ్రాంచైజీని వదిలి ఆక్షన్‌లోకి రావాలనుకుంటున్నాడట. ఒకవేళ అదే జరిగితే ఈసారి జరగబోయే మెగా ఆక్షన్‌లో ఇతడికి జాక్‌పాట్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా మ్యాచ్ విన్నర్స్ కోసం ఎదురుచూస్తున్న ఫ్రాంచైజీలు చాలా ఉన్నాయి. అందులో ఆర్సీబీ ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటికే ఓపెనింగ్ బ్యాటర్ ఫాఫ్ డుప్లెస్సీని రిలీజ్ చేయాలనుకుంటున్న ఆర్సీబీ..ఆ స్థానాన్ని బట్లర్‌తో భర్తీ చేసేందుకు ఏ మాత్రం వెనుకాడదు. విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ బాధ్యతలు తిరిగి అప్పగించేందుకు రెడీ అయిన ఆర్సీబీ ఈసారి ఎలాగైనా టీమ్‌ను పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలని చూస్తోంది. ఒకవేళ కేఎల్ రాహుల్‌ను తీసుకున్నా..బట్లర్‌నూ దక్కించుకునే చాన్స్ ఉంది. ఎందుకంటే ఆసీస్ విధ్వంసక ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను వదులుకోవాలని ఆర్సీబీ డిసైడైంది. గత సీజన్‌లో అతడు ఏ మాత్రం ఆకట్టుకోలేదు. డుప్లెస్సీ, మ్యాక్స్‌వెల్‌ను వదులుకుని ఆక్షన్‌లో బట్లర్‌ను తీసుకుంటే సరి. ఎలాగూ విల్ జాక్స్ ఉండనే ఉన్నాడు. లోయర్ మిడిల్ ఆర్డర్ కోసం మరొక ఆల్‌రౌండర్‌ను తీసుకుంటే, ఆర్సీబీ ఫారిన్ కోటా బ్రహ్మాండంగా తయారవుతుంది.
బట్లర్ వేలంలోకి వస్తే..ఆ టీమ్‌కే

Categories:
Related Post

వార్నర్ రికార్డ్ బ్రేక్ చేసిన కింగ్వార్నర్ రికార్డ్ బ్రేక్ చేసిన కింగ్
ఐపీఎల్‌లో అత్యధిక 50+ స్కోర్లు సాధించిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డ్ క్రియేట్ చేశాడు. పంజాబ్ కింగ్స్ పై హాఫ్ సెంచరీ చేయడంతో కోహ్లీ 50+ స్కోర్ల సంఖ్య 67కు చేరింది. అంతకు ముందు ఈ రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట

పే…..ద్ద ఓవర్పే…..ద్ద ఓవర్
శార్దూల్ ఠాకూల్…ఉరఫ్ లార్డ్ శార్దూల్ ఠాకూర్. కోల్‌కత నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 13వ ఓవర్లో వరుసగా 5 వైడ్లు వేశాడు. ఆ తర్వాతే లీగల్‌గా ఓవర్ మొదలైంది..మొత్తంగా 11 బాల్స్ వేసి ఓవర్ ముగించాడు. ఐపీఎల్ చరిత్రలో ఇలా పే…ద్ద

ధోని..ద ఫినిషర్..అంతేధోని..ద ఫినిషర్..అంతే
చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులంతా ఎప్పుడెప్పుడె థలా ధోని మ్యాచ్ ఫినిష్ చేస్తాడా అని ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని ద ఫినిషర్ అనే ట్యాగ్ లైన్‌ను మళ్లీ గుర్తు