చెన్నై సూపర్ కింగ్స్ ఊహించినట్టుగానే ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ముఖ్యంగా మాజీ కెప్టెన్ ఎమ్ ఎస్ ధోనిని అన్‌క్యాప్డ్ ప్లేయర్ కోటాలో రిటైన్ చేసుకుంది. అందుకోసం రూ.4 కోట్లు చెల్లించింది. అంతేనా అని నోరెళ్లబెట్టొద్దు, చాలా లెక్కలుంటాయి అవి ఇప్పుడు అప్రస్తుతం. థలా టీమ్‌లో ఉండటమే సీఎస్కేకి కావాలి. అన్‌క్యాప్డ్ ఐతే ఏంటి? అసలు క్యాప్డ్ ఐతే ఏంటి? సరే అన్‌క్యాప్డ్ ఎందుకయ్యాడనే విషయం చాలా మందికి తెలిసినా, మరొకసారి గుర్తు చేసుకుందాం..బీసీసీఐ కొత్త రూల్స్ ప్రకారం ఇంటర్నేషనల్ క్రికెట్‌కు 5 సంవత్సరాల పాటు దూరంగా ఉన్న ఏ ప్లేయర్ ఐనా అన్‌క్యాప్డ్ గా పరిగణించబడతాడు. ధోని విషయంలోనూ అంతే..ఇప్పుడసలు టాపిక్ ఏంటంటే ధోని టీమ్‌లో ఏం చేస్తాడు..నెంబర్ 3లో ఆడతాడా? ఫినిషర్ రోల్ ప్లే చేస్తాడా? వికెట్ కీపింగ్ చేస్తాడా? అనే డౌట్స్ వస్తాయి..వాటికి సమాధానం….
ఈ ఒక్కడుంటే చాలు టీమ్‌ను మొత్తం ఫుల్లుగా మోటివేట్ చేసి ఫ్యూచర్‌లోనూ చాంపియన్ జట్టుగా నిలబడేందుకు కృషి చేస్తాడు. ఇంక ఎన్ని సీజన్లు అంటే చెప్పలేం..ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్. మహీకి ఆటగాడిగా ఓపిక ఉన్నంత వరకు సీఎస్కేలోనే ఉంటాడు. ఆ తర్వాత మెంటార్‌గా ఉంటాడా? కోచ్‌గా కొనసాగుతాడా అనేది మహీ ఇష్టం.