లక్నో సూపర్ జెయింట్స్ వదులుకునేందుకు సిద్ధపడిన కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ జట్టులోకి తీసుకునేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించిన టాక్స్ కూడా జరిగాయట. కేఎల్ రాహుల్ నమ్మ కన్నడిగ అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో బజ్ మొదలైంది. ఈ క్లాసీ ప్లేయర్ ఆర్సీబీలో అడుగుపెట్టడం లాంఛనమే అని తెలుస్తోంది. ఇక కింగ్ విరాట్ కోహ్లీకే నాయకత్వ బాధ్యతలు మరోసారి అప్పగించేందుకు ఆర్సీబీ రెడీ అయింది. అంతకు ముందు ఫాఫ్ డుప్లెస్సీ కెప్టెన్సీ చేసిన సంగతి తెలిసిందే. ఫాఫ్‌ను రిలీజ్ చేయడమూ ఖాయమే. ప్రస్తుతానికైతే ఆర్సీబీ మేనేజ్మెంట్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ విషయంలోనే క్లారిటీతో ఉన్నట్టు తెలుస్తోంది. మిగతా వాళ్లలో మహ్మద్ సిరాజ్‌ను కంటిన్యూ చేసే అవకాశాలు లేకపోలేదు. రజత్ పటిదార్, విల్ జాక్స్, స్వప్నిల్ సింగ్ గత సీజన్‌లో మంచి పెర్ఫార్మెన్ ఇచ్చారు. ఐతే ఆర్టీఎమ్ (రైట్ టు మ్యాచ్) ఉండటంతో ఆక్షన్‌లో వీళ్లలో ఎవరైనా సరిపోయే ధరకు అందుబాటులోకి వస్తే తీసుకోవచ్చు. మొత్తానికి కన్నడ అభిమానులు మాత్రం నమ్మ కింగ్..నమ్మ రాహుల్ అంటూ ఇప్పటికే సోషల్ మీడియాను స్లోగన్స్‌తో దంచేస్తున్నారు.
ఇటు కింగ్..అటు కేఎల్ కమింగ్..
Categories:
Related Post
క్లాసెన్ కాకా..కెవ్వు కేకక్లాసెన్ కాకా..కెవ్వు కేక
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్ అందరూ ఊహించిందే..ఐతే హెన్రిక్ క్లాసెన్ కోసం ఖర్చు చేసిన ధర మాత్రం ఐపీఎల్ చరిత్రలోనే సెకండ్ బెస్ట్..అక్షరాలు 23 కోట్ల రూపాయలు. ఇన్నాళ్లు భారీ మొత్తం అంటూ ఊహాగానాలు చక్కర్లు కొట్టినా, ఇప్పుడు అవే
ఫామ్‌లో ఉన్నాడు..ఫేట్ మారాల్సిందేఫామ్‌లో ఉన్నాడు..ఫేట్ మారాల్సిందే
ఐపీఎల్ మెగా ఆక్షన్‌కు టైమ్ దగ్గర పడుతోంది. నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఈ మెగా ఆక్షన్ జరగనుంది. ఐతే ఆక్షన్‌లో లిస్ట్ అయిన తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లలో ముఖ్యంగా చెప్పుకోవల్సింది కేఎస్ భరత్ గురించి. 2015లోనే
వేలంలో గాలం ఎవరికి?వేలంలో గాలం ఎవరికి?
ఐపీఎల్ మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరగనున్నదని సమాచారం. బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నవంబర్ 22 నుంచి ఇండియా ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ ఆడనుంది. ఐతే