Cricket Josh Matches 12 ఏళ్ల చ‌రిత్ర 3 రోజుల్లో మటాష్

12 ఏళ్ల చ‌రిత్ర 3 రోజుల్లో మటాష్

12 ఏళ్ల చ‌రిత్ర 3 రోజుల్లో మటాష్ post thumbnail image

2012 ముందు వ‌ర‌కు టీమిండియా స్వ‌దేశంలో టెస్ట్‌లు గెల‌వ‌డం, ఓడ‌టం…సిరీస్‌లు గెల‌వ‌టం, ఓడ‌టం అప్పుడ‌ప్పుడూ జ‌రుగుతూ ఉండేది, కానీ విరాట్ శ‌కం మొద‌ల‌య్యాక సీన్ మారిపోయింది. ఓట‌మే లేదు. టెస్ట్ మ్యాచ్ ఓడినా, ఆ సిరీస్ మాత్రం గెలిచేవారు. 2022 నుంచి రోహిత్ శ‌ర్మ టెస్ట్ కెప్టెన్సీ చేప‌ట్టాక కూడా అదే గెలుపు ఫార్ములా కొన‌సాగింది. అలా మొత్తంగా గ‌డిచిన 12 ఏళ్ల‌లో స్వ‌దేశంలో వ‌రుస‌గా 18 సిరీస్‌లు గెలిచిన ఘ‌న‌త టీమిండియాది. ఆ జైత్ర‌యాత్ర‌కు న్యూజిలాండ్ ముగింపు ప‌లికింది. పుణెలో జ‌రిగిన రెండో టెస్ట్‌ను మూడు రోజుల్లోనే ముగించింది. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 259 ర‌న్స్ చేస్తే..ఇండియా 156 ర‌న్స్‌కే కుప్ప‌కూలింది. అక్క‌డ మొద‌లైంది ప‌త‌నం..ఆ త‌ర్వాత రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 255 ర‌న్స్ చేసి ఇండియాకు 359 ర‌న్స్ టార్గెట్ ఇచ్చింది. కివీస్ స్పిన్న‌ర్ల ధాటికి 245 ర‌న్స్ కే కుప్ప‌కూలి 113 ప‌రుగుల తేడాతో ఓట‌మిపాలైంది.
న్యూజిలాండ్ 259 & 255 | ఇండియా 156 & 245

1955 లో న్యూజిలాండ్ తొలిసారి ఇండియాలో టెస్ట్ సిరీస్ గెలవ‌గా, 69 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు గెలిచింది. కివీస్ ఆనందానికి అవ‌ధుల్లేవు, ఎందుకంటే వాళ్లు రీసెంట్‌గా శ్రీలంక చేతిలో సిరీస్ ఓడిపోయి వ‌చ్చారు. ఆ లోటును టెస్టుల్లో నెంబ‌ర్ వ‌న్ టీమ్‌ను ఓడించ‌డం ద్వారా సంతోషంగా మార్చుకున్నారు. అది కూడా మ‌న‌కు న‌చ్చిన‌ట్టు త‌యారుచేసిన స్పిన్ పిచ్‌ల‌పై మ‌న‌ల్నే ఓడించి వాళ్ల ఆత్మ‌విశ్వాసాన్ని రెట్టింపు చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

ఆ ఒక్క షాట్‌తో..రెండు జేబుల్లో చేతులు పెట్టుకునిఆ ఒక్క షాట్‌తో..రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని

జ‌స్ట్ ఇమాజిన్, ఒక బ్యాట్స్‌మ‌న్ ఒక షాట్ అద్భుత‌మైన రీతిలో కొడితే క్రికెట్ ప్ర‌పంచ‌మంతా రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని అలా న‌డుచుకుంటూ ఎక్క‌డికో వెళ్తుంటే.. గూస్ బంప్స్ వ‌చ్చేలా ఆడిన ఇన్నింగ్స్‌లు ఎన్నో ఉన్నాయి..కానీ ఆ ఒక్క షాట్ క్రికెట్

అశ్విన్ కోటా మారిన‌ట్టేనా..?అశ్విన్ కోటా మారిన‌ట్టేనా..?

టీమిండియా స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్…స్పిన్న‌ర్ అంటే అభిమానులు ఊరుకునేలా లేరు. ఎందుకంటే అశ్విన్‌ను ఇప్పుడు ఆల్‌రౌండ‌ర్ అనాల్సిందే. అత‌ని గ‌ణాంకాలు చూస్తూ విశ్లేష‌కులు సైతం ఒప్పుకోవాల్సిందే. 101 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 500ల‌కు పైగా వికెట్లు తీసి..3422 ర‌న్స్ చేశాడు.

పేరే కాదు, ఆట కూడా..ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీయేపేరే కాదు, ఆట కూడా..ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీయే

బెంగ‌ళూరులో ఇండియాతో జ‌రిగిన టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆట‌గాడు ర‌చిన్ ర‌వీంద్ర సెంచ‌రీ కొట్టాడు..అంద‌రికీ తెలుసు క‌దా, ర‌చిన్ ర‌వీంద్ర అనే పేరు ఎవ‌రు, ఎందుకు పెట్టారో కూడా కొద్ది మందికి తెలుసు. ఐనాస‌రే మ‌రోసారి గుర్తు చేసుకుందాం. ఇత‌ని నాన్న,