ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తమ జట్టును వదిలేయనున్నాడు..లక్నో ఫ్రాంచైజీయే రాహుల్‌ను రిలీజ్ చేయనుంది. ఐపీఎల్ మెగా ఆక్షన్ నవంబర్ 25, 26 తేదీల్లో సౌదీలో జరగనుంది. మెగా ఆక్షన్‌కు ముందే అన్ని ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ లిస్ట్‌ను బీసీసీఐకి పంపాల్సి ఉంటుంది. అది కూడా అక్టోబర్ 31 డెడ్ లైన్. అందుకే అన్ని ఫ్రాంచైజీలు తమ లిస్ట్‌ను సిద్ధం చేసుకుంటున్నాయి. రీసెంట్‌గా టెస్ట్ సిరీస్‌లో ఫెయిల్ అవుతున్న కేఎల్ రాహుల్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రిలీజ్ చేయనుంది. అందరూ ముందు నుంచీ అనుకున్నట్టే ఆర్సీబీ కేఎల్ రాహుల్‌ను తీసుకుంటుందా? ఇంకా ఏమైనా ట్విస్ట్ ఉంటుందా అనేది వేచి చూడాలి. బెంగళూరు లోకల్ బాయ్ అయిన కేఎల్ రాహుల్..ఐపీఎల్‌లోనూ ఇంపాక్టబుల్ ఇన్నింగ్స్ ఆడింది లేదు, వికెట్ కీపర్‌గానూ ఇన్ అండ్ ఔట్స్ ఉంటున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా ఉన్న రాహుల్..ఆ టీమ్‌లో క్వింటన్ డికాక్ ఆడటం వల్ల అతడే వికెట్ కీపింగ్ చేశాడు. మరోవైపు ఆర్సీబీకి ఇన్నాళ్లు వికెట్ కీపర్‌గా చేసిన దినేశ్ కార్తీక్..గతేడాదే రిటైర్మెంట్ ప్రకటించాడు. మరి ఆర్సీబీ అతడి స్థానంలో కేఎల్ రాహుల్‌ను తీసుకుని వికెట్ కీపర్ పొజిషన్ భర్తీ చేస్తుందా? రజత్ పటిదార్ ఎలాగూ ఆర్సీబీ తరపున మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు, అతడు కూడా వికెట్ కీపింగ్ చేస్తాడు. వికెట్ కీపర్ కోసమే వెళ్లాలంటే ఆక్షన్‌లోనూ బోలెడన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కాదని రాహుల్‌ను తీసుకునే ప్రయత్నం చేస్తుందా? ఇప్పటికే ఈసాలా కప్ నమ్దే అంటూ కప్ కోసం ఆశగా చూస్తున్న ఆర్సీబీ..కేఎల్‌ను తీసుకుని రిస్క్ చేస్తుందా? అనేది డౌటే.
లక్..నో అంటే లోకల్ ఓకేనా

Related Post

ఇదీ.. మరక మంచిదే టైపుఇదీ.. మరక మంచిదే టైపు
బెంగళూరు టెస్ట్ మ్యాచ్‌లో సపోజ్ ఇండియా ఓడితే ఓడొచ్చు గాక…పర్‌సపోజ్ చావుతప్పి కన్నులొట్టబోయినట్టు డ్రా చేసుకునే చాన్స్ ఉండొచ్చు గాక..అద్భుతమేదైనా జరిగి 2001లో కోల్‌కత టెస్టులో ఆస్ట్రేలియాపై వీరోచితంగా ఆడిన లక్ష్మణ్, ద్రవిడ్……కోహ్లీ, రోహిత్‌ను పూనవచ్చుగాక..ఏది జరిగినా అంతా టీమిండియా మంచికే

సరెసర్లే.. ఎన్నెన్నో అనుకుంటాంసరెసర్లే.. ఎన్నెన్నో అనుకుంటాం
అబ్బా..మళ్లీ ఇది కూడా సిరీస్ వైట్ వాష్ గురించే కదా. ఔను తప్పదు, ఇది ఇండియా కదా..మిగతా దేశాల్లోలాగా ఇక్కడ క్రికెట్ అంటే ఆట మాత్రమే కాదు, నరాల్లో ప్రవహించే రక్తం లాంటింది. తగిలింది చిన్నదెబ్బ కాదుకదా, అందుకే అన్నింటినీ పరిశీలించాలి.

ఓహో..తెలుగోళ్లకు ఆ రూట్ ఇదేనా?ఓహో..తెలుగోళ్లకు ఆ రూట్ ఇదేనా?
ఎక్కడి వాళ్లనైనా ఓన్ చేసుకునే మంచితనం తెలుగు అభిమానులకు ఉంది. అది సినిమాలోనైనా, ఆటలోనైనా..సరే మనకు ఈ వేదికపై సినిమా టాపిక్ కాదు కాబట్టి, అది వదిలేద్దాం. క్రికెట్ విషయానికొస్తే.. అదీ తెలుగు ప్లేయర్స్ ఆడుతుంటే..అభిమానులను ఆపతరమా..ఇప్పటి వరకు తెలుగు గడ్డ