అబ్దుల్ సమద్, రీసెంట్‌గా రంజీ మ్యాచ్‌లో రెండు సెంచరీలు చేశాడు. జమ్మూ కశ్మీర్ తరపున ఆడుతున్న యంగ్ బ్యాటర్ ఒడిశాపై రెండు ఇన్నింగ్సుల్లో రెండు సెంచరీలు బాదాడు. మంచి విషయమే కదా, ఐతే తెలుగు అభిమానుల్లోనూ కొందరు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఇతడు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నాడు. ఎందుకు ఆడిస్తున్నారు అంటూ ఇతనిపై ప్రతీ సీజన్‌లో విమర్శలు వస్తూనే ఉంటాయి అదే వేరే విషయం. ఐనా సరే ఫ్రాంచైజీ పెద్దగా పట్టించుకోదు, ఆటగాడూ పట్టించుకోడు, సరే పట్టించుకోవద్దు కూడా. ఐతే ఇప్పుడు సమద్ విషయంలో సన్‌రైజర్స్ పై కొంత ఒత్తిడి ఉంది. రిటైన్ లిస్ట్ అక్టోబర్ 31 వరకు బీసీసీఐకి పంపించాలి. ఇప్పటికే ఎవరెవరిని రిటైన్ చేసుకోవాలనే విషయంపై సన్‌రైజర్స్ యాజమాన్యం తర్జనభర్జన పడుతోంది.
ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, హెన్రిక్ క్లాసెన్ ఎలాగూ కన్ఫర్మ్ అంటున్నారంతా.. నితీశ్ కుమార్‌రెడ్డిని కూడా వదులుకోదు. ఇప్పటికీ ఐదుగురు అయ్యారు. వీళ్లంతా ఆల్రెడీ క్యాప్డ్ ప్లేయర్స్ (దేశానికి ఆడిన వాళ్లు). ఇక మిగిలింది అన్‌క్యాప్డ్ కోటా..అబ్దుల్ సమద్ ఈ కోటా కిందకే వస్తాడు. ప్రస్తుతం సన్‌రైజర్స్ టీమ్‌లో ఉన్న అన్‌క్యాప్డ్ ఆటగాళ్లలో సమద్ ఒక్కడే ఈ ఫ్రాంచైజీకి ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. అందుకే ఇతన్ని బ్యాక్ చేసే చాన్స్ ఉంది. ఐతే కొత్త రూల్స్ ప్రకారం అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను రిటైన్ చేసుకోవాలంటే 4 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరి సన్‌రైజర్స్ హైదరాబాద్ సమద్‌పై 4 కోట్లు పెడుతుందా? లేక ఆక్షన్‌లోకి రిలీజ్ చేసి ఆర్టీఎం ద్వారా తిరిగి దక్కించుకుంటుందా? అనేది ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది.