మీడియాలో అన్నీ అంతే..ఒకదానిపై చర్చ మొదలైందంటే, మామూలుగా ఉండదు. తాజాగా టీమిండియాలో హాట్ టాపిక్ సర్ఫరాజ్‌ఖాన్. బెంగళూరులో న్యూజిలాండ్‌పై సెంచరీతో దుమ్మురేపాడుగా…ఇందులో చర్చేముంది బాగా ఆడాడు కదా..సరే చర్చ దాని గురించి కాదు, ఆ మ్యాచ్‌లో సరిగా ఆడని కేఎల్ రాహుల్‌పైనే చర్చ. దానికి సర్ఫరాజ్‌కు లింకేంటి అంటారా? అక్కడికే వస్తున్నా..రెండో టెస్ట్ కోసం టీమిండియాలో మార్పులు జరగాలని, అందులోనూ సర్ఫరాజ్‌ను కంటిన్యూ చేసి..కేఎల్ రాహుల్‌ను తప్పించాలని కొందరి డిమాండ్ లాంటి వాదన లాంటి కోరిక అన్నమాట. కేఎల్ చాన్స్‌కు ఎసరు పెట్టేదెవరనేగా మీ సందేహం…వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేసే శుభ్‌మన్ గిల్ మెడనొప్పి కారణంగా తొలి టెస్ట్‌లో ఆడలేదు, ఇప్పుడతడు సూపర్ ఫిట్ అని టాక్.. మరి బ్యాటింగ్‌లో విఫలమైన కేఎల్ రాహుల్‌ను తప్పించి గిల్‌ను ఆడిస్తే బెటర్ అని చాలా మంది అంటున్నారు.
రీసెంట్‌గా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డెస్కొటే అలాంటి ప్రశ్నలకు తనదైన స్టైల్లో జవాబిచ్చాడు. కేఎల్‌కు సరిపడా చాన్స్‌లు ఇవ్వాలని కోచ్ గంభీర్ ముందుగానే డిసైడ్ అయ్యాడని చెప్పాడు. సర్ఫరాజ్, కేఎల్ రాహుల్ పేర్లను తీస్తూ ఇద్దరిలో ఒకరు ఉంటే బెటర్ అనే మాటలు కరెక్ట్ కాదన్నాడు. టీమ్‌లో 6 స్థానాలకు 7 గురిని ఎంపిక చేయాల్సి వచ్చినపుడు పిచ్ పరిస్థితులను లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుందని చెప్పాడు. సర్ఫరాజ్ ఫామ్‌లో ఉన్నాడని, అతడి నుంచి మంచి ఇన్నింగ్స్‌లు రావాల్సి ఉందన్నాడు. అంతేకానీ మీడియా ఇప్పటి నుంచే రాహుల్‌ను సర్ఫరాజ్ తో పోల్చొద్దని చెప్పాడు.
అప్పుడే వద్దు బ్రదర్..
Categories: