Cricket Josh Matches దేశానికి ఆడుతుంటే…ఫ్రాంచైజీ పైత్య‌మేమిటో

దేశానికి ఆడుతుంటే…ఫ్రాంచైజీ పైత్య‌మేమిటో

దేశానికి ఆడుతుంటే…ఫ్రాంచైజీ పైత్య‌మేమిటో post thumbnail image

విరాట్ కోహ్లీ…కింగ్ ఆఫ్ క్రికెట్ అనండి, చేజ్ మాస్ట‌ర్ అనండి, మీ ఇష్టం అద్బుత‌మైన ఆట‌గాడికి ఎన్నో పేర్లు పెట్టుకుంటారు ఫ్యాన్స్ ముద్దుగా…అక్క‌డిదాకా ఓకే. ఇండియా త‌ర‌పున ఎన్నో రన్స్ స్కోర్ చేశాడు, ఎన్నో విజ‌యాలు అందించాడు..మురిసిపోదాం, ప్ర‌శంసిద్దాం..ఇదీ ఓకే. ఐపీఎల్‌లో ఆర్సీబీ త‌రపున 17 సీజ‌న్లుగా ఆడుతున్నాడు..ఎన్నో రన్స్ చేశాడు, కానీ కెప్టెన్‌గా ట్రోఫీ గెలిపించ‌లేక‌పోయాడు.. ఐనా స‌రే ఈసాలా క‌ప్ న‌మ్దే అనుకునే హార్డ్ కోర్ అభిమానులు విరాట్‌ను ఎంక‌రేజ్ చేస్తూనే ఉన్నారు. ఇది నిజంగా అద్భుత‌మైన విష‌య‌మే. ఆ వీరాభిమానుల‌కు వీర‌తాళ్లేసుకుకోవాల్సిందే.
ఐతే బెంగ‌ళూరులో న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ క్రీజులోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ మొద‌లు…ఆర్సీబీ, ఆర్సీబీ, ఆర్సీబీ అంటూ అభిమానులు చేసే హంగామా చూస్తే..ఒక ప‌క్క జాలి, మ‌రోప‌క్క చిరాకు అనిపించింది. అరే, అత‌ను ఆడుతున్న‌ది ఇండియాకురా…కోహ్లీ పేరు వ‌చ్చిందే ఇండియాకు ఆడ‌టం వ‌ల్ల‌..ముందు దేశం, ఆ త‌ర్వాతే ఏదైనా…ఇదే విష‌యం మీరు వెళ్లి కోహ్లీనైనా అడ‌గొచ్చు..దేశ‌మే ముందు అనే స‌మాధానం వ‌స్తుంది. అభిమానులూ హ‌ర్ట్ అయిపోకండి..ఆర్సీబీని మీరు ప్రేమిస్తే మేమూ చూసి ఆనందిస్తాం, విరాట్ కోహ్లీపై మీరు చూపించే అంతులేని ప్రేమ‌ను చూసి ఒక తెలుగువాళ్లుగా మీపై ఈర్ష్య క‌లుగుతోంది, మా స‌న్‌రైజ‌ర్స్ టీమ్‌కూ ఇలాంటి ఒక ఇండియా ప్లేయ‌ర్ దొర‌క‌డాయే అని..కానీ ఇండియా త‌ర‌పున ఆడుతుంటే కూడా ఆర్సీబీ అని అరుస్తున్నారు క‌దా, అదే విసుగుపుట్టిస్తోంది. క్రికెట్‌ను అభిమానించే మీరంతా తెలుసుకోవాల్సింది ఒక్క‌టే, ఇండియాలో క్రికెట్ లేక‌పోతే, ఈ ఐపీఎల్ లేదు, ఏ ఫ్రాంచైజీ లేదు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

టీమిండియాలో కొన‌సాగుతున్న‌ ధోనీ ట్రెండ్టీమిండియాలో కొన‌సాగుతున్న‌ ధోనీ ట్రెండ్

బంగ్లాదేశ్‌పై 2-0తో టెస్ట్ సిరీస్ గెలిచిన టీమిండియా సంబ‌రాలు చూసే ఉంటారంతా.. కెప్టెన్ రోహిత్‌శ‌ర్మ ట్రోఫీని ఆకాశ్‌దీప్‌కు ఇవ్వ‌డంతో అత‌డే ట్రోఫీని లిఫ్ట్ చేస్తూ ఫొటోల‌కు ఫోజులిచ్చాడు. ఇవాళ ఏ న్యూస్ పేప‌ర్ వెబ్‌సైట్‌లో చూసిన అవే ఫొటోలు..టీవీల్లో అవే విజువ‌ల్స్.

డ‌కౌట్ ఐతే అయ్యావు..రాటుదేలాలిడ‌కౌట్ ఐతే అయ్యావు..రాటుదేలాలి

తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా ఏ జ‌ట్టుతో జ‌రుగుతున్న అన‌ధికారిక టెస్ట్ మ్యాచ్‌లో డ‌కౌట్ అయ్యాడు. ఏడో నెంబ‌ర్‌లో బ్యాటింగ్‌కు దిగిన నితీశ్ 6 బాల్స్ ఆడి ర‌న్స్ చేయ‌కుండానే పెవిలియ‌న్‌కు చేరాడు. అంతేకాదు ఇండియా ఏ త‌ర‌పున ఏ

ఓరి మీ ఏషాలో స‌రిపోయారు ఇద్ద‌రూఓరి మీ ఏషాలో స‌రిపోయారు ఇద్ద‌రూ

ఒక‌రేమో ఇండియా పాకిస్తాన్‌కు వెళ్లి ఆడితే పాకిస్తాన్ క‌చ్చితంగా ఇండియాను ఓడిస్తుందంటాడు..ఇంకొక‌రేమో పాకిస్తాన్ త‌మ‌ స్పిన్ ట్రాక్‌పై ఇండియాను ఈజీగా బోల్తా కొట్టిస్తుంది అని అంటారు. ఎక్క‌డ దొరికార్రా మీరంతా.. ఈ సీన్ ఆస్ట్రేలియా వ‌ర్సెస్ పాకిస్తాన్ మొద‌టి వ‌న్డే మ్యాచ్