బెంగళూరులో ఇండియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర సెంచరీ కొట్టాడు..అందరికీ తెలుసు కదా, రచిన్ రవీంద్ర అనే పేరు ఎవరు, ఎందుకు పెట్టారో కూడా కొద్ది మందికి తెలుసు. ఐనాసరే మరోసారి గుర్తు చేసుకుందాం. ఇతని నాన్న, అమ్మ.. రవికృష్ణ, దీప బెంగళూరు వారే..1997లోనే వాళ్లు న్యూజిలాండ్‌కి వెళ్లాడు, అక్కడే స్థిరపడ్డారు. 1999లో రచిన్ రవీంద్ర జన్మించాడు.
రవికృష్ణ బెంగళూరులో ఉన్నపుడు క్లబ్ క్రికెట్ ఆడేవాడు..ఇండియా క్రికెటర్స్ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ అంటే తనకు ఇష్టం. అందుకే తన బాబుకు రాహుల్ ద్రవిడ్ పేరు (ఇంగ్లిష్)లోని మొదటి రెండు అక్షరాలు (RA), సచిన్ పేరు (ఇంగ్లిష్)లోని చివరి నాలుగు అక్షరాలు కలిపి…RA CHIN(రచిన్) అని పేరు పెట్టుకున్నాడు. తల్లిదండ్రులతో కలిసి ఇండియాకు రాకపోకలు సాగేవి. బెంగళూరులో బంధువుల ఇళ్లకు వెళ్లేవారు. అంతేకాదు తన తండ్రిలాగే రచిన్ బెంగళూరులో క్లబ్ క్రికెట్ ఆడతాడు. ఒక్క బెంగళూరే కాదు, చెన్నై, యూపీ..ఇలా ఇండియాలోని చాలా చోట్ల ఆడాడు.
అసలు రచిన్ క్రికెట్ ప్రస్థానం మొదలైంది..2016 అండర్ 19 వరల్డ్ కప్ నుంచే..2018లోనూ న్యూజిలాండ్ తరపున అండర్ 19 వరల్డ్‌కప్ ఆడాడు. ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) ఇతడిని రైజింగ్ స్టార్‌గా గుర్తించింది. ఆ తర్వాత మూడేళ్లు దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టాడు. 2021లో తొలిసారిగా న్యూజిలాండ్ టెస్ట్ జట్టుకు ఎంపికయ్యాడు. అరంగేట్రం చేసింది కూడా ఇండియాపైనే, అది కూడా ఇండియాలోని కాన్పూర్‌లో
ఇక ఆ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 13 రన్స్ చేసిన రచిన్ రవీంద్ర….రవీంద్రజడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో 18 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. అంతేకాదు ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓటమి నుంచి తప్పించి..మ్యాచ్ డ్రా అయ్యేలా చేశాడు.
తన తొలి సెంచరీ సౌతాఫ్రికాపై చేశాడు 2024 ఫిబ్రవరిలో..అదికూడా డబుల్ సెంచరీ..240 రన్స్ చేశాడు.
ఇక ఇండియాలో జరిగిన 2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఇంగ్లండ్‌పై సెంచరీ చేసి తమ జట్టు గెలుపులో పాలుపంచుకున్నాడు..మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. మొత్తం ఈ ప్రపంచకప్‌లో మూడు సెంచరీలు చేశాడు. అందులో ఒకటి తనకు ఇష్టమైన బెంగళూరులో పాకిస్థాన్‌పై 108 రన్స్ చేశాడు.
ఐపీఎల్ ఆక్షన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ రచిన్ రవీంద్రను కోటి 80 లక్షలకు దక్కించుకుంది. ఈ సీజన్ మెగా ఆక్షన్‌లో మంచి ధర దక్కే చాన్సుంది. బెంగళూరు సెంటిమెంట్‌తో ఆర్సీబీ దక్కించుకున్నా ఆశ్చర్యం లేదు..
మొత్తానికి రచిన్ రవీంద్ర న్యూజిలాండ్ దేశస్తుడైనా, ఇండియా మూలాలు ఉన్నాయి గనుక..తన ఆట, రికార్డులు ఇండియాలో ఉండటం..ఇండియా చుట్టూ తిరగడం, మరీ ముఖ్యంగా బెంగళూరు చుట్టు తిరగడం విశేషం.
పేరే కాదు, ఆట కూడా..ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీయే
Categories: