Cricket Josh Matches టీమిండియాలో కొన‌సాగుతున్న‌ ధోనీ ట్రెండ్

టీమిండియాలో కొన‌సాగుతున్న‌ ధోనీ ట్రెండ్

టీమిండియాలో కొన‌సాగుతున్న‌ ధోనీ ట్రెండ్ post thumbnail image

బంగ్లాదేశ్‌పై 2-0తో టెస్ట్ సిరీస్ గెలిచిన టీమిండియా సంబ‌రాలు చూసే ఉంటారంతా.. కెప్టెన్ రోహిత్‌శ‌ర్మ ట్రోఫీని ఆకాశ్‌దీప్‌కు ఇవ్వ‌డంతో అత‌డే ట్రోఫీని లిఫ్ట్ చేస్తూ ఫొటోల‌కు ఫోజులిచ్చాడు. ఇవాళ ఏ న్యూస్ పేప‌ర్ వెబ్‌సైట్‌లో చూసిన అవే ఫొటోలు..టీవీల్లో అవే విజువ‌ల్స్. ఐతే ట్రోఫీని టీమ్‌లో కొత్త‌గా వ‌చ్చిన‌వారికి కెప్టెన్ ఇవ్వ‌డ‌మ‌నేది మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీ సెట్ చేసిన ట్రెండ్. 2014లో టెస్ట్‌ల‌కు, 2019లో వ‌న్డే, టీ20ల నుంచి ధోనీ రిటైర‌య్యాడు. ఐతే ఆ ట్రెండ్ మాత్రం అలాగే కంటిన్యూ అవుతోంది.

2014 త‌ర్వాత టెస్ట్ కెప్టెన్సీ చేప‌ట్టిన విరాట్ కోహ్లీ కూడా మ‌హీ విధానాన్నే ఫాలో అయ్యాడు. ఆ త‌ర్వాత టెస్ట్ కెప్టెన్‌గా కొన‌సాగ‌తున్న రోహిత్‌శ‌ర్మ కూడా అదే ట్రెండ్ అనుస‌రిస్తున్నాడు. ఇలా ట్రోఫీని టీమ్‌లో కొత్త‌గా వ‌చ్చిన‌వారికి ఇవ్వ‌డం వెన‌క రీజ‌నేంటో కూడా అప్ప‌ట్లోనే ధోనీ రివీల్ చేశాడు. ఎవ‌రైతే బాగా పెర్ఫార్మ్ చేస్తారో..కొత్త‌గా టీమ్‌తో మింగిల్ అవుతుంటారో..వారికి ట్రోఫీ ఇవ్వ‌డం వ‌ల్ల వాళ్ల‌లో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంద‌ని, ఫ్యూచ‌ర్‌లో మ‌రింత బాగా పెర్ఫార్మ్ చేయ‌డానికి తోడ్ప‌డుతుంద‌ని ధోనీ 2019లో చెప్పాడు. ట్రోఫీని ఎవ‌రు లిఫ్ట్ చేసినా, అంతిమంగా ఆ విజ‌యం టీమ్ మొత్తానికి చెందుతుంద‌న్నాడు. మొత్తానికి టీమిండియా కొన‌సాగిస్తున్న‌ ఈ ట్రెండ్ స్పూర్తితో మిగ‌తా ఆట‌ల్లోని టీమ్స్‌ని కూడా ఉత్తేజ‌ప‌రుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

రెండో టెస్ట్ కోసం లోక‌ల్ బాయ్స్‌..?రెండో టెస్ట్ కోసం లోక‌ల్ బాయ్స్‌..?

బంగ్లాదేశ్‌తో జ‌రిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా బంప‌ర్ విక్ట‌రీ సాధించి ఊపుమీదుంది. ఇక రెండో టెస్ట్ కాన్పూర్‌లో సెప్టెంబ‌ర్ 27 నుంచి మొద‌ల‌వుతుంది. తొలి టెస్ట్‌లో ముగ్గురు పేస్ బౌల‌ర్లు, ఇద్ద‌రు స్పిన్న‌ర్ల‌తో బ‌రిలోకి దిగిన టీమిండియా…రెండో టెస్ట్‌లో స్ట్రాట‌జీ మార్చే

ల‌క్‌..నో అంటే లోక‌ల్ ఓకేనాల‌క్‌..నో అంటే లోక‌ల్ ఓకేనా

ఐపీఎల్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ త‌మ జ‌ట్టును వ‌దిలేయ‌నున్నాడు..ల‌క్నో ఫ్రాంచైజీయే రాహుల్‌ను రిలీజ్ చేయ‌నుంది. ఐపీఎల్‌ మెగా ఆక్ష‌న్ న‌వంబ‌ర్ 25, 26 తేదీల్లో సౌదీలో జ‌ర‌గ‌నుంది. మెగా ఆక్ష‌న్‌కు ముందే అన్ని ఫ్రాంచైజీలు త‌మ రిటెన్ష‌న్

స‌రెస‌ర్లే.. ఎన్నెన్నో అనుకుంటాంస‌రెస‌ర్లే.. ఎన్నెన్నో అనుకుంటాం

అబ్బా..మ‌ళ్లీ ఇది కూడా సిరీస్ వైట్ వాష్ గురించే క‌దా. ఔను త‌ప్ప‌దు, ఇది ఇండియా క‌దా..మిగ‌తా దేశాల్లోలాగా ఇక్క‌డ క్రికెట్ అంటే ఆట మాత్ర‌మే కాదు, న‌రాల్లో ప్ర‌వ‌హించే ర‌క్తం లాంటింది. త‌గిలింది చిన్న‌దెబ్బ కాదుక‌దా, అందుకే అన్నింటినీ ప‌రిశీలించాలి.