డిసెంబర్‌లో జరగబోయే ఐపీఎల్ మెగా ఆక్షన్ కోసం పది ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. ఐతే కొత్త నిబంధనల ప్రకారం ప్రతీ టీమ్ ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. దీంతో ఫ్రాంచైలన్నీ తమ రిటైన్ లిస్ట్‌ను రెడీ చేసుకుంటున్నాయి. ఐతే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎవరిని రిటైన్ చేసుకుంటుందనేది చాలా ఆసక్తికరంగా మారనుంది. ఇద్దరు ఫారిన్ ప్లేయర్స్‌నే రిటైన్ చేసుకోవాలంటే..కచ్చితంగా కెప్టెన్ కమిన్స్ ను వదిలేసి, తిరిగి ఆక్షన్‌లో దక్కించుకోవాలి. ఎందుకంటే కమిన్స్‌ను గతేడాది ఆక్షన్‌లో అత్యధికంగా 20.5 కోట్లకు దక్కించుకుంది. ఇప్పుడా ప్రైస్‌ను తగ్గించుకుంటే మరికొందరు ప్లేయర్స్‌ను కొనుగోలు చేయొచ్చు. రిటైన్ చేసుకోబోయే ఇద్దరు ఫారిన్ ప్లేయర్స్‌లో ట్రావిస్ హెడ్ () వానిందు హసరంగ () ఉండే చాన్స్ ఉంది. వీరిద్దరిని తక్కువ ధరకే తీసుకుంది. ఒకవేళ హసరంగను వదిలేసి హెన్రిక్ క్లాసెన్ ను రిటైన్ చేసుకున్నా..సన్‌రైజర్స్ మంచి వ్యూహాన్నే అనుసరించినట్టవుతుంది. ముగ్గురు ఇండియన్ ప్లేయర్స్‌లో అభిషేక్ శర్మ, నటరాజన్, భువనేశ్వర్ ను రిటైన్ చేసుకోవచ్చు. ఒకవేళ భువీని ఆక్షన్‌లో దక్కించుకోవచ్చనుకుంటే నితీశ్ కుమార్‌ను రిటైన్ చేసుకుంటే బెటర్. మరి మీ ఒపినీయన్ ఏంటో కామెంట్ చేయండి
టీమ్‌కు ఐదుగురు..సన్‌రైజర్స్‌లో ఎవరెవరుంటారు?
Categories: