టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మతో ముంబై ఇండియన్స్ అనుబంధం విడదీయలేనిది. ఐపీఎల్‌లో ఆ టీమ్‌కు 5 సార్లు టైటిల్ అందించిన కెప్టెన్ అతడు. గతేడాది రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్‌కు నాయకత్వం అప్పగించింది ముంబై ఫ్రాంచైజీ. ఐతే అభిమానులు స్టేడియంలో హార్దిక్‌ను ఏ రేంజ్‌లో ఏడిపించారో చూశాం. కానీ టీ20 ప్రపంచకప్ గెలుపు తర్వాత అదే అభిమానులు హార్దిక్‌ను ప్రశంసించారు. సో మ్యాటర్ ముగిసినట్టే అని అనుకోవచ్చు. డిసెంబర్‌లో జరగబోయే ఐపీఎల్ మెగా ఆక్షన్ కోసం బీసీసీఐ కొన్ని నిబంధనలు సవరించనుంది. ఫ్రాంచైజీలు కోరినట్టుగా 5 గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వనుంది. అదే జరిగితే..ముంబై ఇండియన్స్ రోహిత్‌ను తమ వద్దే అట్టిపెట్టుకునే చాన్స్ ఉంది. కెప్టెన్ హార్దిక్, బుమ్రా, సూర్యకుమార్, రోహిత్, తిలక్‌వర్మ లేదా ఇషాన్ కిషన్‌లో ఒకరిని రిటైన్ చేసుకోనుంది. అంతేగానీ ముంబై రోహిత్‌ను వదులుకుంటే ఫ్యాన్స్ ఊరుకుంటారా?
ముంబై కాదంటే ఫ్యాన్స్ ఒప్పుకోరు
Categories: