Cricket Josh Matches అశ్విన్ కోటా మారిన‌ట్టేనా..?

అశ్విన్ కోటా మారిన‌ట్టేనా..?

అశ్విన్ కోటా మారిన‌ట్టేనా..? post thumbnail image

టీమిండియా స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్…స్పిన్న‌ర్ అంటే అభిమానులు ఊరుకునేలా లేరు. ఎందుకంటే అశ్విన్‌ను ఇప్పుడు ఆల్‌రౌండ‌ర్ అనాల్సిందే. అత‌ని గ‌ణాంకాలు చూస్తూ విశ్లేష‌కులు సైతం ఒప్పుకోవాల్సిందే. 101 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 500ల‌కు పైగా వికెట్లు తీసి..3422 ర‌న్స్ చేశాడు. ఇందులో 6 సెంచ‌రీలు, 14 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్‌, వికెట్ కీప‌ర్ ఎమ్ ఎస్ ధోనీ కూడా త‌న టెస్ట్ కెరియ‌ర్‌లో 6 సెంచ‌రీలే చేశాడు. థ‌లా ఫ‌ర్ ఏ రీజ‌న్ అనే అభిమానులు..ఆష్ అన్న ఫ‌ర్ ఏ రీజ‌న్ అని కూడా అంటున్నారు. ఈ చెన్నై చిన్నోడు మ‌రో సెంచ‌రీ చేస్తే క‌పిల్‌దేవ్ రికార్డ్‌ను స‌మం చేస్తాడు. మరి అశ్విన్‌ను కూడా ఆల్‌రౌండ‌ర్ కోటాలో చేర్చాల్సిందే క‌దా అభిమానులంతా…అన్నా ఫ‌ర్ ఏ రీజ‌న్‌..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

ఓరి మీ ఏషాలో స‌రిపోయారు ఇద్ద‌రూఓరి మీ ఏషాలో స‌రిపోయారు ఇద్ద‌రూ

ఒక‌రేమో ఇండియా పాకిస్తాన్‌కు వెళ్లి ఆడితే పాకిస్తాన్ క‌చ్చితంగా ఇండియాను ఓడిస్తుందంటాడు..ఇంకొక‌రేమో పాకిస్తాన్ త‌మ‌ స్పిన్ ట్రాక్‌పై ఇండియాను ఈజీగా బోల్తా కొట్టిస్తుంది అని అంటారు. ఎక్క‌డ దొరికార్రా మీరంతా.. ఈ సీన్ ఆస్ట్రేలియా వ‌ర్సెస్ పాకిస్తాన్ మొద‌టి వ‌న్డే మ్యాచ్

దేశానికి ఆడుతుంటే…ఫ్రాంచైజీ పైత్య‌మేమిటోదేశానికి ఆడుతుంటే…ఫ్రాంచైజీ పైత్య‌మేమిటో

విరాట్ కోహ్లీ…కింగ్ ఆఫ్ క్రికెట్ అనండి, చేజ్ మాస్ట‌ర్ అనండి, మీ ఇష్టం అద్బుత‌మైన ఆట‌గాడికి ఎన్నో పేర్లు పెట్టుకుంటారు ఫ్యాన్స్ ముద్దుగా…అక్క‌డిదాకా ఓకే. ఇండియా త‌ర‌పున ఎన్నో రన్స్ స్కోర్ చేశాడు, ఎన్నో విజ‌యాలు అందించాడు..మురిసిపోదాం, ప్ర‌శంసిద్దాం..ఇదీ ఓకే. ఐపీఎల్‌లో

వీరాభిమానుల మ‌న‌సు ముక్క‌లైంది..వీరాభిమానుల మ‌న‌సు ముక్క‌లైంది..

కాదా మ‌రి..ఎంత‌టి చ‌రిత్ర‌, ఎంత‌టి వైభం. అంద‌నంత ఎత్తు నుంచి ఒక్క‌సారిగా అట్ట‌డుగు పాతాళానికి ప‌డిపోయింది ఇండియా టెస్ట్ క్రికెట్. అది కూడా మ‌న సొంత‌గ‌డ్డ‌పై, తిరుగులేని రికార్డు ఉన్నా..అద్భుత‌మైన ఆట‌గాళ్లు ఉన్నా..న్యూజిలాండ్ చేతిలో చావు దెబ్బ‌తిన్న‌ది. ప‌క్క‌నున్న దేశం శ్రీలంక